Ys Jagan : నేడు ముఖ్య నేతలతో జగన్ భేటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలపై ముఖ్యనేతలతో నేడు ఈ సమావేశంలో చర్చించనున్నారు.
అర్హులను తొలగించడంపై...
అదే సమయంలో ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా పింఛన్ల తొలగింపుతో దివ్యాంగులు ఇప్పటికే రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా ధర్నా చేయాలని నిర్ణయం తీసుకునే అవకాశముంది. సూపర్ సిక్స్ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత లబ్దిదారులను తొలగించడంపై ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకునే అవకాశముంది.