Ys Jagan : నేడు శ్రీకాకుళానికి జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం బయలుదేరి వెళ్లనున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం బయలుదేరి వెళ్లనున్నారు. ఇటీవల మరణించిన పాలకొండ వైసీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. వైసీపీ సీనియర్ నేత రాజశేఖరం అనారోగ్యంతో మరణించారు. ఆయన కుమారుడు విక్రాంత్ తో పాటు కుమార్తె రెడ్డి శాంతిని కూడా ఫోన్ లో ఇప్పటికే పరామర్శంచారు.
అటు నుంచి బెంగళూరుకు...
అయితే నేడు శ్రీకాకుళం జిల్లాలోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం నేతలతో కొద్దిసేపు మాట్లాడే అవకాశాలున్నాయి. జగన్ వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరిగి అక్కడి నుంచి బెంగళూరుకు జగన్ బయలుదేరి వెళతారు.