Ys Jagan : నేడు విజయవాడ జైలుకు జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడ రానున్నారు.విజయవాడ జిల్లా జైలుకు వెళ్లనున్నారు

Update: 2025-02-18 02:08 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడ రానున్నారు. బెంగళూరు నుంచి విజయవాడ చేరుకోనున్న జగన్ విజయవాడ జిల్లా జైలుకు రానున్నారు. విజయవాడ జైలులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీ ఉన్న నేపథ్యంలో వంశీని పరమర్శించేందుకు వైఎస్ జగన్ జిల్లా జైలుకు రానున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయం కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ములాఖత్ అయి...
అయితే వంశీకి భరోసా నిచ్చేందుకు, వంశీ అనుచరులతోపాటు గన్నవరం వైసీపీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు జగన్ జిల్లా జైలుకు వచ్చి వల్లభనేని వంశీతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ములాఖత్ కు సంబంధించిన సమాచారాన్ని జిల్లా జైలు అధికారులకు వైసీపీ నేతలు అందచేశారు. జగన్ రాక సందర్భంగా విజయవాడ జిల్లా జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News