Ys Jagan : నేడు వైఎస్ జగన్ తాడేపల్లి రాక

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు

Update: 2025-03-10 04:12 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకోనున్నారు. మధాహ్నం 4.20 గంటలకు వైఎస్ జగన్ బెంగళూరు నుంచి విమానంలో బయలుదేరి 6.25 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఏడు గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన ఇంటికిచేరుకుంటారు.

ఆవిర్భావ వేడుకలను...
రేపు సీనియర్ నేతలతో జగన్ సమావేశమయ్యే అవకాశముంది. బడ్జెట్ సమావేశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పోలవరం ఎత్తు వంటి విషయాలపై ఆయన సీనియర్ నేతలతో చర్చిస్తారని తెలిసింది. ఈ నెల 12న పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి కూడా జగన్ నేతలకు సూచనలు చేయనున్నారు. అదే రోజు నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాట కార్యక్రమంపై దిశానిర్దేశం చేయనున్నారని తెలిసింది.


Tags:    

Similar News