Ys Jagan : అధికారంలోకి రాగానే తాము నిర్ణయం తీసుకుంటాం : జగన్

తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తామని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు

Update: 2025-09-06 02:31 GMT

తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తామని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్ మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. ''చంద్రబాబు అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను నిన్న కేబినెట్‌లో స్కాంల కోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం. రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం.'' అంటూ వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

మెడికల్ కళాశాలలన్నింటినీ...
''ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబు. ప్రజలకోసం కాకుండా దోపిడీకోసం నిర్ణయాలు తీసుకోవడానికే మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటున్నట్టుగా మీ తీరు ఉంది. 1923 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11. పద్మావతి అటానమస్‌ కాలేజీతో కలుపుకుంటే మొత్తం 12. 2019కి ముందు 3 దఫాలుగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్‌ కాలేజీ అయినా పెట్టారా?'' అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News