Ys Jagan : వల్లభనేని వంశీకి ఏమీ తెలియదు.. ఇది అక్రమ కేసు

రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎన్నడూ లేనంతగా దిగజారి పోయాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.

Update: 2025-02-18 07:11 GMT

రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎన్నడూ లేనంతగా దిగజారి పోయాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీ తో ములాఖత్ అయిన తర్వాత మీడియాతో జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు వంశీ అరెస్ట్ ఉదాహరణ అని జగన్ అన్నారు. వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. వల్లభనేని వంశీని రెచ్చగొట్టేలా వ్యవహరించారని, ఆయనపై చేసిన వ్యాఖ్యలతోనే అనుచరులు ఆగ్రహానికి గురయ్యారని జగన్ తెలిపారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లనే వల్లభనేని గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని జగన్ తెలిపారు.

అధికారంలో ఉన్నప్పటకీ...
తాము అధికారంలో ఉన్నప్పటికీ రెండు వైపులా ఉన్నవారిపై కేసులు పెట్టామని జగన్ చెప్పారు. ఆ ఘటనలో వంశీ లేరు అని అందరికీ తెలుసునని, అందుకే కేసులో వంశీ పేరు పెట్టలేదన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ పై వరస కేసులు నమోదు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. పట్టాభిని చంద్రబాబు రెచ్చగొట్టి దాడి చేయమని పంపించారని తెలిపారు. పట్టాభి అక్కడ ఉన్న ఆయన అనుచరులు ఎస్సీ నేతలపై దాడి చేశారని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని జగన్ అన్నారు.


Tags:    

Similar News