Ys Jagan : కేంద్రాన్ని నిలదీయండి.. జగన్ ఎంపీలకు ఆదేశం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని కోరారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని కోరారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించే విషయంలో రాజీ ధోరణని ప్రదర్శించకుండా ప్రభుత్వాన్ని నిలదీయాని ఎంపీలకు జగన్ పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దంటూ పార్లమెంటు సభ్యులకు సూచించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో...
ఈరోజు తాడేపల్లి కార్యాలయంలో పార్లమెంటు, రాజ్యసభ సభ్యులతో సమావేశమైన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రజల జీవనాడి అని, దాని విషయంలో మాత్రం నిలదీసేందుకు సిద్ధమవ్వాలని కోరారు. కేంద్ర కేబినెట్ లో ఇద్దరు మంత్రులున్నా పోలవరం ఎత్తు తగ్గింపుపై అభ్యంతరం తేకపోవడం విచారకరమన్న జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూడా గళమెత్తాలని ఆదేశించారు.