Ys jagan : గుంటూరు మిర్చియార్డులో వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డుకు చేరుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డుకు చేరుకున్నారు. ఆయనకు పెద్దయెత్తున పార్టీనేతలు, కార్యకర్తలు, రైతులు స్వాగతం పలికారు. మిర్చి యార్డుకు చేరుకున్న జగన్ మర్చి రైతులతో మాట్లాడుతున్నారు. రైతులను కలసి వారికి అందుతున్న గిట్టుబాటు ధరను అడిగి తెలుసుకుంటున్నారు. ధరలు పతనం కావడానికి కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు.
రైతులతో మాట్లాడి...
గతంలో మిర్చి ధర యార్డులో ఎంత ధర పలికింది? ఇప్పుడు ఎంత వస్తుందన్న దానిపై రైతులతో జగన్ మాట్లాడుతున్నారు. గతంలో కంటే ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారికి భరోసా కల్పించేందుకు రైతులతో చర్చిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి మద్దతుగా ఆందోళనకు పిలుపునిచ్చే అవకాశముంది. రైతుల సమస్యలకు పరిష్కారం కూడా వారి నుంచి అడిగి తెలుసుకున్నారు.