Ys jagan : చంద్రబాబూ.. మీ రికార్డులు ఎవరికీ సాధ్యం కావు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరొకసారి ఆగ్రహం వ్కక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేవని ఎక్స్ లో జగన్ ప్రశ్నించారు

Update: 2025-09-16 06:28 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరొకసారి ఆగ్రహం వ్కక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేవని ఎక్స్ లో జగన్ప్రశ్నించారు. ఎక్స్ లో జగన్ పోస్టు ఇలా "చంద్రబాబు గారూ పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా? రూపాయిన్నరకే కిలో టమోటానా? ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా? " అని జగన్ ప్రశ్నించారు.

ఉల్లి, టమాటా ధరలపై...
"క్వింటా ఉల్లిని రూ.1200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్ లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్‌లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబుగారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారూ..తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి" అంటూ వైసీపీ అధినేత జగన్ ఎక్స్ లో కోరారు.



Tags:    

Similar News