Ys Jagan : వైసీపీ వచ్చే నెల 4న వెన్నుపోటు దినోత్సవం
వచ్చేనెల నాలుగోతేదీన వెన్నుపోటు దినంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు
వచ్చేనెల నాలుగోతేదీన వెన్నుపోటు దినంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏపీ ప్రజలను మోసం చేసినందుకు నిరసనగా వెన్నుపోటు దినంగా ఆ రోజు నిరసనలను చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిస్తున్నట్లు జగన్ తెలిపారు. జగన్ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
హామీలు అమలు చేయకపోవడంతో...
జూన్ నాలుగోతేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడంతో అదే రోజు చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు తెలియజెప్పాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో పాటు మేధావులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. అన్ని నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపు నిచ్చారు.