Ys Jagan : కూటమి సర్కార్ పై జగన్ ట్వీట్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం పై ఎక్స్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం పై ఎక్స్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన అబద్ధాల దుష్ప్రచారం పై ఎక్స్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. "టీడీపీ, జనసేన అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఈ కింది ఆరోపణలు చేస్తున్నాయి’.‘వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతింది. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలి వెళ్లాయి. పారిశ్రామికవేత్తలు పారిపోయారు. అప్పుడు ఎలాంటి పారిశ్రామిక పురోగతి లేదు" అని అన్నారు.
పారిశ్రామికరంగంలో...
‘ఒకవేళ అదే నిజమైతే.. తయారీ, పారిశ్రామిక రంగంలో రాష్ట్ర పనితీరు అత్యంత దారుణంగా ఉండేది. కానీ, ఈ కింది గణాంకాలు.. అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితికి అద్దం పడుతున్నాయి’. భారత రిజర్వ్ బ్యాంక్ ఈనెల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ‘2019–24 మధ్య ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారత్‌లో నెం.1 గానూ, యావత్ దేశంలో 5వ స్థానంలోనూ నిల్చింది’. ‘అదే 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం పురోగతిలో దక్షిణ భారత్‌లో నెం.1 గానూ, యావత్ దేశంలో 8వ స్థానంలోనూ నిల్చింది’. మరి దీన్ని బ్రాండ్ ఏపీ నాశనం అంటారా? లేక సమర్థవంతమైన నాయకత్వం ద్వారా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటారా?. – సత్యమేవ జయతే" అని జగన్ ట్వీట్ చేశారు.