YSRCP : ఐ ప్యాక్ ను నమ్ముకుంటే అధోగతే.. అందుకే జగన్ రూటు మార్చారా?

వైఎస్సార్పీపీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి

Update: 2025-12-03 09:02 GMT

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైఎస్సార్పీపీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నేతల నుంచి క్యాడర్ వరకూ అదే కోరకుంటున్నారు. ముందుగా పార్టీ లో ఉండి కూటమి కు పరోక్షంగా మద్దతు చేసే నేతలపై కన్ను వేసి ఉంచాలని నిర్ణయించింది.ఎట్టి పరిస్థితి లోనూ కోవర్టులకు ప్రాధాన్యత ఇవ్వొద్దని ఇంచార్జ్ లకు జగన్ సూచిస్తున్నారు. పార్టీ కష్ట కాలంలో మౌనంగా ఉన్న నేతలను కూడా గుర్తించాలని,అధికారం ఉంటే వచ్చి పెత్తనం చచేయటం కాదని, అధికారం లో లేనప్పుడు పార్టీ శ్రేయస్సు కోరి పార్టీ కు బలం ఇచ్చే వారే నిజమైన నాయకులు గా గుర్తించాలని వైసీపీ క్యాడర్ బలంగా కోరుకుంటుంది.

పదవులు తీసుకుని మరీ...
హోదా కోసం పదవులు తీసుకొని సైలెంట్ గా ఉన్నవారిని గుర్తించి వారిని పదవుల నుంచి తప్పించాలన్న డిమాండ్ ఇటీవల వైసీపీలో ఎక్కువగా వినిపిస్తుంది.ఏ హోదా లేకున్నా పార్టీ కోసం శ్రమించే వారికి మంచి స్థానం కల్పించాలని జగన్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కూటమి లో చేరిన వైసీపీ నాయకులకు మళ్ళీ తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేసినా నో ఎంట్రీ అని చెప్పాలని క్యాడర్ కోరుకుంటుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు విపరీతంగా కనిపిస్తున్నాయి. అటువంటి వారిని ప్రమాద కారులుగా గుర్తించి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నార. అన్ని నియోజకవర్గాలలో పరిస్థితి ఏ రోజు డేటా ఆ రోజు సెంట్రల్ ఆఫీస్ కు చేరుతుండటంతో ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు? ఎవరు చేయడం లేదన్నది తెలిసిపోతుంది.
గతంలో ఐ ప్యాక్ ను నమ్ముకుని...
గతంలో ఐ ప్యాక్ ను నమ్ముకొని మోస పోయామని, ఇప్పుడు అంతా పార్టీ కేడర్ నే నిఘా వర్గాల పరిశీలన చేస్తుంది అనే విషయాన్ని గమనించాలని చెబుతున్నారు. ముఖ్య కార్యకర్తలు తమ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తుండటం విశేషం. అందుకే జగన్ కూడా కార్యకర్తల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ పైనే ఎక్కువ ఆధారపడుతున్నారని సమాచారం. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడే కార్యకర్తల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ లో నిజముందని భావించిన జగన్ వారి అభిప్రాయాలకు పెద్దపీట వేసే ఆలోచనలో ఉన్నారు. అందుకే జగన్ ఇక ఐ ప్యాక్ మరొక సర్వేల పైనే ఆధారపడకుండా నియోజకవర్గంలో కొందరు ముఖ్య కార్యకర్తలపైనే ఆధారపడి నిర్ణయాలు తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. మరి ఈ మార్పు మంచిదేగా.


Tags:    

Similar News