YSRCP : నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసన ప్రదర్శనలు

ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగం నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించింది

Update: 2025-06-10 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగం నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించాలని నిర్ణయిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది అయినా మహిళలు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు ఆగడం లేదని, అందుకు నిరనసగా రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలను అందచేయాలని నిర్ణయించింది.

వైసీపీ మహిళ విభాగానికి ...
వైసీపీ మహిళ విభాగానికి చెందిన నేతలందరూ ఈ నిరసన ప్రదర్శనలలో పాల్గొని తమ ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేయాలని కోరింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ మహిళ విభాగం పిలుపు నిచ్చింది. అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, రాజకీయ కక్షలతో వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఈ నిరసన ప్రదర్శనను నిర్వహించాలని కోరింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యాకాండలపై గొంతెత్తి నినదించాలని పిలుపు నిచ్చింది. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News