YSRCP : ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24వ తేదీన కీలక సమావేశం జరగనుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24వ తేదీన కీలక సమావేశం జరగనుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. గత పదిహేను నెలల నుంచి కూటమి ప్రభుత్వం వైఫల్యం, సూపర్ సిక్స్ హామీల అమలులో లొసుగులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.
పార్టీ బలోపేతం చేయడంపై...
దీంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలను ఆహ్వానించార. సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరింది.