హైకోర్టును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేసింది. రేపు జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పరామర్శించేందుకు బయలుదేరి వెళ్లాలని జగన్ భావించారు.
జగన్ నెల్లూరు పర్యటనపై..
అయితే సరైన హెలిప్యాడ్ లేకపోవడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. తాత్కాలిక హెలిప్యాడ్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టులో అనుమతి కోరారు. జగన్ పర్యటన సందర్భంగా రోప్ పార్టీ ఏర్పాటుకు ఆదేశించాలని వైసీపీ పిటీషన్ లో పేర్కొంది. నేడు వైసీపీ పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. ఈ విచారణ తర్వాత జగన్ నెల్లూరు పర్యటన ఖరారవుతుంది.