Ys Jagan : నేడు అసెంబ్లీకి హాజరుపై జగన్ క్లారిటీ ఇస్తారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై స్పష్టత నిచ్చే అవకాశముంది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై స్పష్టత నిచ్చే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు హాజరు కానున్నారా? లేదా? అన్నది ఈరోజు జరిగే మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగే మీడియా సమావేశంలో అసెంబ్లీ సమావేశాల హాజరుపై జగన్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
సూపర్ సిక్స్ హామీలపై...
దీంతో పాటు నిన్న వైసీపీ చేసిన అన్నదాత పోరు కు పోలీసులు విధించిన ఆంక్షలతో పాటు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో అక్రమ అరెస్టుల గురించి కూడా జగన్ నేడు ప్రస్తావించే అవకాశముంది. నేడు అనంతపురంలో సూపర్ సిక్స్ హామీలపై కూటమి ప్రభుత్వం సభను ఏర్పాటు చేయడంతో వాటిని అమలు ఎక్కడ చేశారని జగన్ ప్రశ్నించనున్నారు. పింఛన్ల దగ్గర నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వరకూ, దివ్యాంగుల పింఛన్ల విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించనున్నారని తెలిసింది.