Ys Sharmila : జూన్ 9 నుంచి షర్మిల రాష్ట్ర వ్యాప్త పర్యటన

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిల మరోసారి తన ప్రయత్నాలను ప్రారంభించారు

Update: 2025-05-27 12:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిల మరోసారి తన ప్రయత్నాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాలని నిర్ణయించారు. మూడు విడతలుగా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ కార్యకర్తలను, నేతలను సమన్వయం చేయడంతో పాటు కాంగ్రెస్ అవససరం రాష్ట్రానికి తెలియజేస్తూ తన పర్యటన కొనసాగించాలని భావిస్తున్నారు.

జూన్ 9వ తేదీ నుంచి...
వైఎస్ షర్మిల జూన్ 9వ తేదీ నుంచి మూడు విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి సిద్ధమవుతున్నారు. అయితే తన తొలి పర్యటనను చిత్తూరు జిల్లా నుంచి పర్యటన ప్రారంభించనున్న పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలజూన్ 30న మచిలీపట్నంలో తన తొలి దశ పర్యటన ముగింపు సభ నిర్వహించేలా ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం రోడ్డు మ్యాప్ ను కూడా రూపొందించారు.


Tags:    

Similar News