Ys Sharmila : చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఏం సెటైర్లు వేశారంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ షర్మిల సెటైర్ వేశారు

Update: 2025-01-23 12:21 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ షర్మిల సెటైర్ వేశారు. అదానీపై చర్యలకు చంద్రబాబు గారికి కచ్చితమైన సమాచారం అవసరమట అని, సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట అని, బాబు మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్ అని వైఎస్ షర్మిల సెటైర్ వేశారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారు ? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారు ? అదానీ పవర్ ఎక్కువ రేటు పెట్టీ కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని ఎందుకు చెప్పారు ? తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

అదానీతో ఒప్పందంపై...
ప్రతిపక్షంలో ఉండగా అదానీ చంద్రబాబుకు శత్రువుగా కనిపించారని, అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడుగా మారిపోయారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని, అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని, అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్.బి.ఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. అమెరికన్ కోర్టుల్లో అదానీపై కేసులు కూడా పెట్టారన్న వైఎస్ షర్మిల ఇంత తతంగం నడుస్తుంటే, అన్ని ఆధారాలు కళ్ళముందు కనిపిస్తుంటే, అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, కచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లేనని వైఎస్ షర్మిల తెలిపారు.


Tags:    

Similar News