Ys Jagan : వైఎస్ జగన్ విదేశీ పర్యటన రద్దవుతుందా?

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ విదేశీ పర్యటనను రద్దు చేయాలంటూ సీబీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది

Update: 2025-10-16 03:28 GMT

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ విదేశీ పర్యటనను రద్దు చేయాలంటూ సీబీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో జగన్ తన ఫోన్ నెంబరుకు బదులు వేరే నెంబరు ఇచ్చారని, ఇది బెయిల్ షరతులు ఉల్లంఘించడమేనని సీబీఐ న్యాయవాదులు వేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడంతో దానిపై నేడు విచారణ జరగనుంది. జగన్ పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కూడా సీబీఐ పిటీషన్ లో కోరింది.

ఐరోపా పర్యటన...
ఇటీవల జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ పై న్యాయస్థానం జగన్ తరుపున న్యాయవాదులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. నేడు దీనిపై విచారణ జరగనుంది. ఐరోపా పర్యటనకు ఈ నెల 1 నుంచి తేదీ 30 వతే దీ మధ్య పదిహేను రోజుల పాటు తనకు అనుమతివ్వాలని జగన్ పిటీషన్ ను అనుమతించింది. అయితే ఫోన్ నెంబరు, ఈ మెయిల్ ఐడీ సమర్పించాలని కోర్టు షరతులు విధించింది. కానీ ఫోన్ నెంబరు వేరేది ఇవ్వడంతో షరతులు ఉల్లంఘించారని సీబీఐ పేర్కొంది.


Tags:    

Similar News