Ys Jagan : రాష్ట్రమంతటా కల్తీ మద్యమే... రెడ్ బుక్ తో అక్రమ కేసులే
రెడ్ బుక్ పాలనలో వైసీపీ నేతలపై కక్ష సాధింపునకు దిగుతున్నారని వైఎస్ జగన్ అన్నారు
రెడ్ బుక్ పాలనలో వైసీపీ నేతలపై కక్ష సాధింపునకు దిగుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. కల్తీ మద్యం కేసులో జయచంద్రారెడ్డిని ఇంతవరకూ అరెస్ట్ చేయలేదనితెలిపారు. రాష్ట్రమంతటా కల్తీ మద్యం దందా నడుపుతున్నది టీడీపీ నేతలేనని అన్నారు. కేసులు మాత్రం వైసీపీ నేతలపై పెడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. కల్తీమద్యం వీళ్లే తయారు చేస్తూ వీళ్ల ప్రభుత్వంలో వీళ్ల దుకాణాల్లోనే అమ్ముతూ తప్పుడు వాంగ్మూలాలతో వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. జోగి రమేష్ ను తీసుకెళ్లి అరెస్ట్ చేశారన్నారు.
దొంగే దొంగా దొంగా అన్నట్లు...
దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉందన్నారు. అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. కల్తీ లిక్కర్ నడుపుతున్నది టీడీపీ వాళ్లేనని అన్నారు. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీమద్యం దందా నిర్వహించింది టీడీపీ నేతలే అన్నారు. పల్నాడు జంట హత్య కేసుల్లోనూ చంపిన వారు చనిపోయిన వారు ఇద్దరూ టీడీపీ నేతలేనని స్వయంగా ఎస్పీ చెప్పినా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఇటువంటి పనులు చేస్తేనే నక్సలిజం వస్తుందని వైఎస్ జగన్ అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పదహారు కేసులు పెట్టారన్నారు.