నేడు వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధుల విడుదల
నేడు వైఎస్ జగన్ బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులు విడుదల చేయనున్నారు.
నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా లబ్దిదారులకు నగదు జమ చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి కార్యాలయం నుంిచ బయలుదేరి నిజాంపట్నం చేరుకుంటారు. అనంతరం అక్కడ జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
నిజాం పట్నంలో....
ఆ తర్వాత లబ్దిదారులకు బటన్ నొక్కి మత్స్యకార భరోసా కార్యక్రమం కింద లబ్దిదారులకు బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.