Ys Jagan : రేపటి నుంచి కడప జిల్లాలో జగన్ పర్యటన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2025-11-24 01:41 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. 25, 26,27 తేదీల్లో ఆయన కడప జిల్లాలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొన్ని వ్యక్తిగత కార్యక్రమాలతో పాటు, కార్యకర్తలతోనూ వైఎస్ జగన్ సమావేశమవుతారు. ప్రజాదర్బార్ కార్యక్రమంలోనూ వైఎస్ జగన్ పాల్గొంటారు. రేపు మధ్యాహ్నానికి బెంగళూరు నుంచి కడపకు చేరుకుంటారు.

మూడు రోజుల పాటు...
అక్కడి నుంచి పులివెందులకు వెళతారు. తర్వాత స్థానిక ప్రజలు, కార్యకర్తలతో సమావేశమై వారి నుంచి వినతులను స్వీకరిస్తారు. 26వ తేదీన పూర్తిగా వివాహ వేడుకకు హాజరవుతారు. దీంతో పాటు పలువుని నేతలను కలవనున్నారు. అనంతరం 27వతేదీన ఆయన తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళతారు. వైఎస్ జగన్ కడపకు వస్తున్న సందర్భంగా కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News