Ys Jagan : ఎవరినీ వదిలిపెట్టం.. జగన్ మాస్ వార్నింగ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ జగన్ అన్నారు.

Update: 2025-02-05 13:38 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ జగన్ అన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్లతో సమావేశమైన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారిఅధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలను, నేతలను వేధించిన వారిని ఎవరినీ వదిలపెట్టేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో ముప్ఫయి ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలుతుందని ఆయన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలను బెదిరిస్తారని, అయితే ఎవరూ భయపడవద్దని కేసులు వచ్చినా తాము అండగా ఉంటామని తెలిపారు.

అందరినీ గుర్తు పెట్టుకోండి...
మంచి చేసిన వారితో పాటు చెడు చేసిన వారిని కూడా గుర్తుపెట్టుకోవాలని జగన్ నేతలతో అన్నారు. కార్యకర్తలకు ఈసారి పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదన్న జగన్ కేసులపై న్యాయపోరాటంచేయడానికి పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. అక్రమ కేసులు పెడితే ప్రయివేటు కేసులు వేస్తామని కూడా హెచ్చరించారు. ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, నేతలు లేకపోయినా మనకు జనం అండగా ఉన్నారని, ఈ ప్రభుత్వంపై ఇప్పటికే వ్యతిరేకత వచ్చిందని జగన్ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News