Ys Jagan : త్వరలో వైసీపీ యాప్.. అప్ లోడ్ చేసిన వెంటనే
వైసీపీ తరఫున త్వరలో యాప్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు వైఎస్ జగన్ తెలిపారు.
వైసీపీ తరఫున త్వరలో యాప్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వేధిస్తే వెంటనే యాప్‌లో నమోదు చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అన్యాయం జరిగిన వెంటనే యాప్‌లో నమోదు చేయవచ్చంటున్న జగన్.. పలానా వ్యక్తి, పలానా అధికారి కారణంగా ఇబ్బంది పడ్డానని యాప్‌లో ప్రస్తావించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
అధికారంలోకి రాగానే చర్యలు...
ఆధారాలుగా ఉన్న వీడియోలు, పత్రాలు యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చని, కంప్లైంట్ ఆటోమేటిక్ గా వైసీపీ డిజిటల్ సర్వర్‌లోకి వచ్చేస్తుందని, వైసీపీ అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై ఖచ్చితంగా పరిశీలన చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని, ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జగన్ తెలిపారు. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం అని వైఎస్ జగన్ అన్నారు.