Ys Jagan : భీమవరం సభలో పవన్, చంద్రబాబును ఏకిపారేసిన జగన్

చంద్రబాబుకు తన మీద కోపం ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తుందని వైఎస్ జగన్ అన్నారు.

Update: 2024-04-16 12:19 GMT

చంద్రబాబుకు తన మీద కోపం ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తుందని వైఎస్ జగన్ అన్నారు. భీమవరంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. తనపై శాపనార్ధాలు పెడుతుంటాడని, రాళ్లు వేయమని, అంతం చేయమని పిలుపునిస్తుంటాడు అన్నారు. చంద్రబాబు తనను అడగి కూడని ప్రశ్నను అడిగినందుకే తనపై అంత కోపం అన్నారు. చెరువులో చేపల తినడానికి వచ్చిన కొంగ మాదిరగా జపం చేస్తున్నావు ఎందుకయ్యా అని అడిగానని, అది అడగటం తప్పా అని చంద్రబాబును ప్రశ్నించారు. నీ పేరు చెబితే పేదలకు గుర్తుకు వచ్చే ఒక్కటంటే స్కీమ్ ఉందా అని అడిగా. పేదలకు చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోట్లు, మోసం, దగా, అబద్ధాలు కుట్రలు అని అన్నారు.

వాళ్లకు ఓట్లేస్తే....
వాళ్లకు ఓట్లేసే పథకాలు ఆగిపోతాయి.. సంక్షేమం జరగదు.. ఓటేసే ముందు ఆలోచించండి అని జగన్ అడిగారు. అదే మాదిరిగా దత్తపుత్రుడిని కొన్ని ప్రశ్నలను అడిగానని, పెళ్లిళ్లకు ముందు హామీలు ఇచ్చి పెళ్లి తర్వాత కార్లు మార్చేసినట్లు భార్యలను వదిలేసి ఇప్పడు నియోజకవర్గాలను వదిలేస్తున్నావు అని దత్తపుత్రుడిని అడిగానని, అందుకే దత్తపుత్రుడిలో ఈ మధ్య బీపీ కనిపిస్తుందన్నారు. అది పొరపాటు కాదని, అలవాటుగా మార్చుకున్నాడని జగన్ అన్నారు. ఆయనను చూసి ప్రతి ఒక్కరూ తప్పు చేయడం మొదలుపెడితే, ప్రతి ఒక్కరూ నాలుగేళ్లు, ఐదేళ్లకొకసారి భార్యలను మారిస్తే ఈ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏంటని తాను అడిగినందుకే బీపీ పెరిగిందన్నారు. తలూపుతాడు.. కాళ్లూపుతాడు. చేతులూపుతాడంటూ జగన్ ఎద్దేవా చేశారు.
వాటిని నమ్ముకుని....
ఇలా అడుగుతున్నందుకే వదినమ్మకు, చంద్రబాబు భజంత్రీలయిన మీడియాకు కోపం వస్తుందని అన్నారు. ఈ వర్గాలన్నింటినీ ఎలా ఉంచావు అని అడిగితే చంద్రబాబుకు తనపై కోపం వస్తుందని అన్నారు. పథ్నాలుగేళ్లు అధికారంలో ఉన్నా మంచి కోసం ఉపయోగించలేదని జగన్ అన్నారు. పొత్తులను, కుట్రలను నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారన్నారు. తాను ఒక్కడినేనని, వాళ్లు పది మంది ఉన్నారని అన్నారు. వాళ్లు విసిరే బాణాలు తగిలేది తనకు కాదని, జగన్ అమలు చేస్తున్న పథకాలకు అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుతున్నానని అన్నారు. వాలంటీర్లు కూడా ఇంటికి వచ్చే అవకాశముండదన్నారు. తాను చేసిన మార్పులు ఇక వారికి ఓటేస్తే కనిపించవని చెప్పారు. వారి బాణాలు తగిలేది అవ్వాతాతలకు అందించే పెన్షన్ కు తగులుతుందని అన్నారు.



Tags:    

Similar News