Ys Jagan : నేడు ఇడుపులపాయలో జగన్

నేడు పులివెందుల నుంచి ఇడుపులపాయకు మాజీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2025-12-24 04:01 GMT

నేడు పులివెందుల నుంచి ఇడుపులపాయకు మాజీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం ఇడుపులపాయలో వైసీపీ శ్రేణులతో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై జగన్ నేతలతో చర్చించనున్నారు.

నేతలతో సమావేశం...
సాయంత్రం తిరిగి పులివెందులకు చేరుకుని ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రేపు ఉదయం క్రిస్మస్ పండగ సందర్భంగా పులివెందుల చర్చిలో జగన్ ప్రార్థనల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.రేపు మధ్యాహ్నం తిరిగి బెంగళూరుకు జగన్ వెళ్లనున్నారు.


Tags:    

Similar News