ఇంత అన్యాయంగా ఏనాడూ ఎన్నికలు జరగలే.. వైఎస్ జగన్
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కుట్రపూరితంగా బూత్‌లు మార్చారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కుట్రపూరితంగా బూత్‌లు మార్చారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. పోలింగ్ బూత్‌ల దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని.. అందుకు మంగళవారం పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా దాడులే నిదర్శనమని అన్నారు.
రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఏనాడూ ఎన్నికలు జరగలేదన్నారు. చంద్రబాబు రాక్షస పాలన సాగిస్తున్నారని.. ఆయనొక మాబ్‌స్టర్, ఫ్రాడ్‌స్టర్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 పంచాయతీల్లో 700 మంది పోలీసులను పెట్టారు.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే పోలీసులను పెట్టారని.. ఒక్కో బూత్‌లో 500 మంది వరకూ బయటివాళ్లు ఓటు వేశారని ఆరోపించారు. బీటెక్ రవి పులివెందుల ఓటరు కాకపోయినా అక్కడే తిష్టవేశారు.. బందిపోటు దొంగల తరహాలో ఎన్నిక జరిగిందన్నారు.