Ys Jagan : నేడు కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

Update: 2025-11-04 01:54 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన పర్యటన కృష్ణా జిల్లాలో సాగనుంది. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు, బైపాస్, పామర్రు మీదుగా పెడన నియోజకవర్గం చేరుకుంటారు.

పెడన నియోజకవర్గంలో...
పెడన నియోజకవర్గంలోని గూడూరులో ఆయన పర్యటన సాగనుంది. ఇటీవల మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. రైతులతో మాట్లాడతారు. అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. వరద నష్టం, రైతులకు పరిహారం అందచేయకపోవడంపై ప్రభుత్వం మీడియా సమావేశం ద్వారా వివరించనున్నారని తెలిసింది.


Tags:    

Similar News