అమెరికాలో ఏపీ యువకుడికి ఐదు కోట్ల ప్యాకేజీ

సాఫ్ట్ వేర్ రంగంలో ఐదు కోట్ల వార్షిక వేతనాన్ని పొందిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు

Update: 2025-09-07 04:42 GMT

సాఫ్ట్ వేర్ రంగంలో ఐదు కోట్ల వార్షిక వేతనాన్ని పొందిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. గుంతకల్లు కుచెందిన సాయి సాకేత్ కు ఐదు కోట్ల ప్యాకేజీతో అమెరికాలో ఉద్యోగం లభించింది. అమెరికాలోని ఆప్ఠివర్ సాఫ్ట్ వేర్ సంస్థలో ఈ ుద్యోగం లభించింది. ఇందుకోసం పది వారాల పాటు ఇంటర్నిప్ కోసం అర్హత సాధించిన సాయి సాకేత్ కు ఆ సమయంలో కోటి రూపాయలు వేతనం చెల్లించనున్నారు.

గుంతకల్లుకు చెందిన...
కోర్సు పూర్తయిన వెంటనే ఏడాదికి ఐదు కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తామని సంస్థ అగ్రిమెంట్ చేసింది. గుంతకల్లుకు చెందిన రమేష్, వాసవి దంపతులు పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. వీరి కుమారుడు సాకేత్ అమెరికాలో బీటెక్ చదువుతుండగానే ఈ భారీ ఆర్థిక ప్యాకేజీ లభించింది. దీంతో గుంతకల్లులోని సాయి సాకేత్ బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News