వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్

వైసీపీ ప్లీనరీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు.

Update: 2022-07-07 08:07 GMT

వైసీపీ ప్లీనరీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ను ప్రకటిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ మేరకు నియామకాల నిబంధనల్లో మార్పులు తేనున్నారు. ఎల్లుండి వైసీపీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంది. ఈసందర్భంగా ఎల్లుండి తీర్మానంలో పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక అధ్యక్ష ఎన్నిక లేకుండా శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను నియమిస్తూ తీర్మానం కూడా చేయనున్నారు.

పన్నెండేళ్లుగా...
12 సంవత్సరాలుగా జగన్ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇందులో తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ ప్లీనరీ జరగనుంది. 2017లో వైసీపీ ప్లీనరీ జరిగింది. మరోవైపు రేపు దాదాపు 1.50 లక్షల మంది ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వైసీపీ ప్లీనరీకి హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.


Tags:    

Similar News