Breaking : వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మిధున్ రెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చారు. మిధున్ రెడ్డి అరెస్ట్ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా సిట్ అధికారులు తెలియజేశారు. 12. 30 గంటల నుంచి ఆరున్నరగంటల పాటు విచారణ చేశారు. మిధున్ రెడ్డి అరెస్ట్ తో మొత్తం ఈ కేసులో పన్నెండు మంది అరెస్ట్ అయినట్లు తేలింది.
విచారణ ముగించిన తర్వాత...
అన్ని కోణాల్లో విచారించిన మిధున్ రెడ్డిని ఆయన ముందు గతంలో అరెస్టయిన వారు చెప్పిన వివరాలను, ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలిసింది. మిధున్ రెడ్డిని ఈరోజు అరెస్ట్ చేసిన నేపథ్యంలో రేపు ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి ఎ4 నిందితుడిగా ఉన్నారు. అరెస్టయిన మిధున్ రెడ్డి ఈ రాత్రికి సిట్ కార్యాలయంలోనే ఉండనున్నారు.