Midhun Reddy : నేడు మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ

వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది

Update: 2025-07-18 02:21 GMT

వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి పేరును కూడా చేర్చడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది. దీంతో మిధున్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు కొట్టివేయడంతో...
నేడు మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో జస్టిస్ పార్ధివాల, జస్టిస్ మహదేవన్ ల ధర్మాసనం విచారించనుంది. మద్యం స్కామ్ కు సంబంధించి తనకు సంబంధం లేదని, ఇప్పటికే తనను సిట్ అధికారులు విచారించారని, తనకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉన్నందున తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటీషన్ లో మిధున్ రెడ్డి కోరారు.


Tags:    

Similar News