నేడు విజయవాడకు మిధున్ రెడ్డి
వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి నేడు విజయవాడకు రానున్నారు
వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి నేడు విజయవాడకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ మిధున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన సిట్ ఎదుట హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
సిట్ విచారణకు...
అయితే ఏసీబీ న్యాయస్థానం మాత్రం మిధున్ రెడ్డి పై అరెస్ట్ వారెంట్ జారీ కోసం సిట్ అధికారులు వేసిన పిటీషన్ ను తిరస్కరించడంతో ఆయనను సిట్ అధికారులు విచారింంచి వదిలేస్తారా? లేక అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. మిధున్ రెడ్డి ఈరజు విజయవాడ వస్తున్నారని మాత్రం సిట్ అధికారులకు సమాచారం అందింది.