Pinnelli : మాచర్లకు పిన్నెల్లి నో ఎంట్రీ.. కేవలం అక్కడ వరకు మాత్రమే అనుమతి

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల నియోజకవర్గానికి వెళ్లవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు

Update: 2024-05-25 03:46 GMT

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల నియోజకవర్గానికి వెళ్లవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం కౌంటింగ్ రోజు మాత్రం నరసరావుపేటకు మాత్రం వెళ్లవచ్చని తెలిపింది. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం పగుల కొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయనను జులై ఆరోతేదీ ఉదయం వరకూ అరెస్ట్ చేయవద్దని తెలిపింది.

నిఘా ఉంచాలని...
అయితే మాచర్ల లోకి అడుగు పెట్టవద్దని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఆదేశించారు. ఆయనను అక్కడకు వెళ్లకుండా ప్రతి క్షణం ఆయనపై నిఘా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మాచర్లకు వెళితే మళ్లీ ఘర్షణలు చెలరేగుతాయని భావించి ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ లభించడంతో ఆయన నేరుగా నరసారావుపేట కౌంటింగ్ కేంద్రానికి జూన్ 4వ తేదీన చేరుకుంటారు.


Tags:    

Similar News