Rajya Sabha Nominations:రాజ్యసభకు నామినేషన్లు దాఖలు
ఈ నెల 27వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ సభ్యులు నామినేషన్లు వేశారు
Rajya Sabha Nominations:
ఈ నెల 27వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ సభ్యులు నామినేషన్లు వేశారు. ఈరోజు అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ సభ్యులుగా గొల్ల బాబూరావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డిలు తమ నామినేషన్ల పత్రాలను సమర్పించారు. సోమవారం అసెంబ్లీలో రాజ్యసభ ఎంపి అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారైన సంయుక్త కార్యదర్శి యం.విజయరాజు వద్ద వారి నామినేషన్లను దాఖలు చేశారు.
బీఫారాలు అందచేసి...
ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థుల వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లిఖార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. అంతకు ముందు వైసీపీ అధినేత జగన్ వారి ముగ్గురికీ బీఫారాలు అందచేశారు.