వల్లభనేని వంశీ అనారోగ్యం: కస్టడీలోని వైసీపీ నేత ఆసుపత్రిలో
కస్టడీలో ఆరోగ్యం క్షీణించిన వల్లభనేని వంశీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్య పంకజశ్రీ చేరారు.
గన్నవరం మాజీ శాసనసభ్యుడు, వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వంశీకి, పోలీసుల కస్టడీలో ఆరోగ్యం క్షీణించింది. ఆయన పరిస్థితిని గమనించిన పోలీసులు కంకిపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. వంశీ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఆయన భార్య పంకజశ్రీ కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.