గుంటూరు సీఐడీ కార్యాలయానికి సజ్జల
గుంటూరు సీఐడీ కార్యాలయానికి సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చారు.
గుంటూరు సీఐడీ కార్యాలయానికి సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో విచారించడానికి సజ్జల రామకృష్ణా రెడ్డికి సీఐడీ అధికారుల నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందగా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చారు.
సీఐడీ అధికారులు...
ఆయనను సీఐడీ అధికారులు విచారించనున్నారు. టీడీపీ కార్యాలయంలో దాడి జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏ ఫోన్ వినియోగించారు? ఎవరికైనా ఆదేశాలు జారీ చేశారా? అంటూ ప్రశ్నలతో సజ్జల రామకృష్ణా రెడ్డిని విచారించనున్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణా రెడ్డిఏ 121నిందితుడిగా ఉన్నారు.