నేడు పోలీసు విచారణకు నల్లపురెడ్డి
నేడు పోలీస్ విచారణకు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హాజరు కానున్నారు.
నేడు పోలీస్ విచారణకు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హాజరు కానున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రావాలని కోవూరు పోలీసులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కోవూరు పోలీస్ స్టేషన్ లో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు.
నోటీసులు జారీ చేయడంతో...
ఇప్పటికే ప్రసన్నకుమార్‌రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఈ రోజు విచారణ తర్వాత పోలీసులు ప్రసన్నకుమార్ రెడ్డిని విచారించి వదిలేస్తారా? లేక అరెస్ట్ చేస్తారా? అన్న దానిపై నెల్లూరు జిల్లాలో చర్చ జరుగుతుంది. ఇదే కేసులో రేపు విచారణకు రావాలని మాజీమంత్రి అనిల్‌కుమార్‌కు ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు.