వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత
వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు
వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో నిర్వహిస్తున్న వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతుండగా బొత్స సత్యనారాయణ సొమ్మ సిల్లి పడిపోయారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన డీహైడ్రేషన్ కు గురై పడిపోయి ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
చీపురుపల్లిలోని కార్యక్రమంలో...
చీపురుపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైద్యులు వచ్చి ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. బొత్స సత్యనారాయణ ఏడాది క్రితం గుండెకు సంబంధింత వ్యాధి రావడంతో సర్జరీ చేయించుకున్నారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆయనను ప్రాధమిక చికిత్స చేయించిన అనంతరం విశాఖ ఆసుపత్రికి తరలించే ప్రయత్నిస్తున్నారు.