YSRCP : కడప జడ్పీ ఛైర్మన్ ఫ్యాన్ పార్టీ ఖాతాలో

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది.

Update: 2025-03-27 07:08 GMT

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో జడ్పీ ఛైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమయింది. అయితే యాభై జడ్పీటీసీ స్థానాల్లో నలభై మందికి పైగానే వైసీపీకి చెందిన జడ్పీటీసీలు ఉన్నారు.

బలం లేకపోవడంతో...
టీడీపీకి పదిమందికి మించి లేరు. దీంతో ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమషన్ నిర్ణయించడంతో వైసీపీ తమ పార్టీకి చెందిన జడ్పీటీసీలను క్యాంప్ నకు తరలించారు.అయితే తమ గెలుపునకు అవసరమైన బలం లేకపోవడంతో టీడీపీ ఈ ఎన్నికలో పోటీకి దింపలేదు. దీంతో వైసీపీ ప్రకటించిన గోవిందరెడ్డి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.


Tags:    

Similar News