Big Breaking : వైసీపీకి బిగ్ షాక్... మరో ఎంపీ రాజీనామా
ఎన్నికల సమయంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బాలశౌరి పార్టీకి రాజీనామా చేశారు
third list of the in-charges of ysr congress party constituencies
ఎన్నికల సమయంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బాలశౌరి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గత కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్నారు. మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానితో గత కొంతకాలంగా బాలశౌరికి పొసగడం లేదు. ఈ విషయంలో అధినాయకత్వం కూడా పేర్ని నానికి అండగా నిలిచింది.
సీటు రాదని...
దీంతో పాటు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి మచిలీపట్నం నుంచి పోటీ చేయాలని బాలశౌరి భావించినా ఆయనకు టిక్కెట్ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతుంది. వంగవీటి రాధాను మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీకి పోటీకి దింపాలని యోచనలో ఉందని తెలియడంతో బాలశౌరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన కుమారుడికి అవనిగడ్డ సీటు కూడా ఇవ్వడం లేదని తేలడంతో ఎంపీ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారని తెలిసింది.