YSRCP : నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాక్
నెల్లూరు జిల్లాలో వైసీపీికి షాక్ తగిలింది. ఉదయగిరి నియోజకవర్గం నేత వైసీపీకి రాజీనామా చేశారు
third list of the in-charges of ysr congress party constituencies
నెల్లూరు జిల్లాలో వైసీపీికి షాక్ తగిలింది. ఉదయగిరి నియోజకవర్గం నేత వైసీపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మెట్టుకూరు చిరంజీవి తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మెట్టుకూరు చిరంజీవి రెడ్డి తెలిపారు.
టీడీపీలో చేరడానికి...
అయితే వ్యక్తి గత కారణాల దృష్ట్యా తాను రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను చిరంజీవి పార్టీ అధినేత వైఎస్ జగన్ కు పంపించారు. చిరంజీవి త్వరలోనే టీడీపీ లో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.