Sajjla : మద్యనిషేధాన్ని అందుకే అమలు చేయలేకపోయాం

ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

Update: 2024-02-19 11:58 GMT

ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ పాలనలో ఇది చేశామని చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేదన్నారు. జగన్ ను తిట్టడం తప్ప వాళ్లు ఏం మాట్లాడుతున్నారని సజ్జల ప్రశ్నించారు. వైసీపీ 99 శాతం మ్యానిఫేస్టోను పూర్తి చేశామని గర్వంగా చెప్పుకుంటుందని ఆయన అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారని ఆయన నిలదీశారు. మద్యపాన నిషేధం చేద్దామని భావించామని, తొలుత దశలు వారీగా చేయాలని భావించినా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోలేకపోయామని చెప్పారు. అయితే ఊరూరా బెల్ట్ షాపులను తొలగించామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

జగన్ ను సవాల్ చేసే...
తాము చెబుతున్న వాటిలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో చెప్పాలని ఆయన నిలదీశారు. తాము ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగపడుతుందని తాము గర్వంగా చెప్పుకోగలమని, అలాగే చంద్రబాబు తాను పెట్టిన జన్మభూమి కమిటీలు బ్రహ్మాండమైనవని ఎందుకు చెప్పలేకపోతున్నారని అన్నారు. తాము ఇన్ని మంచి పనులు చేశామని చెప్పుకుని ప్రజలను ఓటేయాలని కోరుతున్నామని, అదే చంద్రబాబు తాను ఈ మంచి పని చేశామని ఒక్కటైనా చెప్పుకోగలరా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సిద్ధం సభలకు హాజరవుతున్న సభలను చూస్తుంటే ఎవరికి ప్రజాదరణ ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు


Tags:    

Similar News