Ys Jagan : సాయిరెడ్డిపై జగన్ ఆగ్రహం
విజయసాయిరెడ్డిపై వైసీపీ చీఫ్ వైసీపీ అధినేత జగన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు
విజయసాయిరెడ్డిపై వైసీపీ చీఫ్ వైసీపీ అధినేత జగన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారని అన్నారు. రాజ్యసభ స్థానం పదవీ కాలం మూడున్నరేళ్లున్నా ప్రలోభాలకు లొంగిపోయిన విజయసాయిరెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేశారని చెప్పరు. కూటమికి మేలు చేయడానికే విజయసాయిరెడ్డి రాజ్యసభను అమ్మేసుకున్నారని జగన్ అన్నారు.
కూటమికి వెళుతుందని తెలిసీ...
తాను రాజీనామా చేస్తే ఆ స్థానం కూటమికి వెళుతుందని తెలిసి కూడా రాజీనామా చేశారన్నారు. అలాంటి వ్యక్తులు చెప్పే మాటలకు విలువ ఉంటుందా? అని జగన్ ప్రశ్నించారు. కేవలం అబద్ధాలు చెబుతూ మద్యం విషయంలో అనేక అసత్యాలు ఆయన చేత చెప్పించారని అన్నారు. ప్రలోభాలకు లొంగిపోయే వారి వ్యాఖ్యలకు విశ్వసనీయత ఉండదని కూడా జగన్ అన్నారు.