Ys Jagan : జగన్ ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా

భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా మాజీ సీఎం వైఎస్‌.జగన్‌ రేపటి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది

Update: 2025-05-27 04:43 GMT

భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా మాజీ సీఎం వైఎస్‌.జగన్‌ రేపటి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటించాల్సి ఉంది. పొగాకు రైతులను పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని పార్టీ నేతలు జగన్ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

భారీ వర్షాల దృష్ట్యా...
అయితే భారీ వర్షాల దృష్ట్యా మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి రేపటి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడిందనిన పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాతావరణం అనుకూలించిన తర్వాత వైఎస్ జగన్‌ ప్రకాశం జిల్లా పర్యటన విషయమై తదుపరి ప్రకటన చేస్తామని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.


Tags:    

Similar News