Ys Jagan : నేడు పొదిలికి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్నారు

Update: 2025-06-11 01:55 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్లి అక్కడ పొగాకు రైతులను పరామర్శించనున్నారు. పొగాకు రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకునేందుకు జగన్ నేరుగా పొదిలి వెళ్లి రైతులతో మాట్లాడతారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడతుండటంతో వారితో మాట్లాడి వారిసమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. నిజానికి ఈ నెల 28వ తేదీన పొదిలిలో ఉన్న పొగాకు బోర్డును జగన్ సందర్శించాల్సి ఉంది.

పొగాకు రైతులతో భేటీ...
అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా అప్పుడు వాయిదా వేసుకున్నారు. దీంతో నేడు పొదిలి బయలుదేరి వెళుతున్నారు. ఉదయం పది గంటలకు పొదిలికి చేరుకుని రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. వారి కష్టాలను తెలుసుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇవ్వనున్నారు. అనంతరం మీడియాతో కూడా జగన్ మాట్లాడనున్నారు. అక్కడి నుంచి నేరుగా బయలుదేరి తాడేపల్లి కార్యాలయానికి జగన్ చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News