Ys Jagan : ఈ నెల 11న పొదిలికి వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 11వ తేదీన ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 11వ తేదీన ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్నారు. పొగాకు రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకుఆయన పొదిలికి రానున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఈ ఏడాది తీవ్రంగా నష్టపోతున్నారు. పండించిన పంటకు సరైన మద్దతు ధర కూడా లభించకపోవడంతో గత కొంతకాలంగా పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పొగాకు రైతులతో ముఖాముఖి...
తమకు కనీస మద్దతు ధరను కల్పించాలని పొగాకు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 11న ఉదయం పది గంటలకు పొదిలిలో ఉన్న పొగాకు బోర్డుకు వైఎస్ జగన్ చేరుకుంటారు. అక్కడ ఉన్న రైతులతో నేరుగా జగన్ మాట్లాడతారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడతారు. జగన్ పర్యటన సందర్భంగా పెద్దయెత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు వస్తారని తెలిసి భారీబందోబస్తు ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు జిల్లా పోలీసు అధికారులను కోరారు.