Ys Jagan : 18న వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటన
ఈ నెల 18వ తేదీన వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోనిసత్తెనపల్లి మండలంలో ఆయన పర్యటన కొనసాగుతుంది
ఈ నెల 18వ తేదీన వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోనిసత్తెనపల్లి మండలంలో ఆయన పర్యటన కొనసాగుతుంది. వైసీపీకి చెందిన ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్ ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లిలో పర్యటించనున్నారు.
నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను...
సత్తనపల్లిలోని రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. నాగ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టడం వల్లనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ సత్తెనపల్లిలోని రెంటపాల్లకు ఈ నెల 18వ తేదీనరానున్నారని వైసీపీ నేతలు తెలిపారు. జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీనేతలు పర్యవేక్షిస్తున్నారు.