Ys Jagan : నేడు కడప జిల్లాకు జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన జిల్లాలోనే ఉంటారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన జిల్లాలోనే ఉంటారు. ఈరోజు సాయంత్రం బెంగళూరు నుంచి బయలుదేరి ఐదు గంటలకు పులివెందులకు చేరుకుంటారు. రాత్రికి పులివెందులలోని తన క్యాంప్ కార్యాలయంలో బస చేస్తారు. రేపు ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి ఇడుపులపాయకు 7.30 గంటలకు చేరుకుంటారు.
రెండు రోజుల పాటు ...
అక్కడ వైఎస్సార్ ఘాట్ లో నివాళులర్పిస్తారు. రేపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారు. అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళతారు. వైఎస్ జగన్ రాక సందర్భంగా భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు వస్తారని తెలిసి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.