Ys Jagan : ఈనెల 9న చిత్తూరు జిల్లాకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన జగన్ చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో పర్యటించనున్నారు. అక్కడ తోతాపురి మామిడి రైతులను పరామర్శించనున్నారు. కనీసం గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో జగన్ వారిని పరామర్శించాలని నిర్ణయించారు.
మామిడి రైతులకు పరామర్శ...
రైతులు కొందరు కలసి తమ గోడును జగన్ కు వెళ్లబోతసుకున్నారు. చిత్తూరు మామిడిని నాలుగు రూపాయలకు కొనుగోలు చేసే దిక్కు లేకపోవడంతో జగన్ వెళ్లి ప్రభుత్వం పై వత్తిడి తెచ్చేందుకు పర్యటన చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కనీసం పల్ప్ పరిశ్రమలను కూడా ప్రభుత్వం ఆదేశించకపోవడమేంటని రైతులు తరుపున ప్రభుత్వాన్ని జగన్ నిలదీయనున్నారు.